Home  »  TV News  »  Jayam serial : విజయేంద్ర ప్రతాప్‌ను నిలదీసిన విశ్వ.. రుద్ర గతం వెనుక దాగిన రహస్యం ఏంటి?

Updated : Apr 30, 2026

జీ తెలుగు ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -256 లో.......గంగ, రుద్ర ఇద్దరు సుధా ఇంటికి వస్తారు. గంగకి ఇష్టమైన స్వీట్ చేస్తుంది సుధా. అది తింటుంటే రుద్ర కోపంగా చూస్తాడు. నువ్వు ఎక్కడికి వచ్చినా తిండి గురించి తప్ప ఏం ఆలోచించావా అని రుద్ర అంటాడు. సర్ మీరు తనకి బాక్సింగ్ కోచ్ గా ఉండండి.. మీ దగ్గర అయితే భయంగా ఉంటుందని రుద్ర అనగానే అది జరగదని విశ్వ చెప్తాడు. నేర్పిస్తాడులే బాబు అని సుధా అంటుంది. ఆ తర్వాత విశ్వని సుధ పక్కకి పిలిచి.. ఏవండి వాళ్ళు మొదటిసారి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి బట్టలు పెట్టాలి తీసుకొని రండి అని చెప్తుంది. నేను వద్దంటే ఇప్పుడు బాధపడుతావు కానీ ఒక కండిషన్.. నువ్వు రుద్ర మేనత్త అని తెలియకుడదని విశ్వ అనగానే సరే అంటుంది సుధా.

మరొకవైపు పెద్దసారు, శకుంతల గుడికి వెళ్తారు. తనతో పాటు రంగా కూడా వెళ్తాడు. ఆ తర్వాత సుధాతో గంగ కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే లక్ష్మీ వస్తుంది. గంగ ఎక్కడ అని అడుగుతుంది. ఇప్పుడే మేడమ్ తో కిచెన్ లోకి వెళ్ళిందని రుద్ర చెప్తాడు. వాళ్ళ అమ్మకి సాయం చేస్తుందా అని లక్ష్మీ అనగానే రుద్ర షాక్ అవుతాడు. దాంతో రుద్రకి డౌట్ రాకుండా లక్ష్మీ డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు అసలు నీ కూతురు ఏ మాయ చేసిందో ఏమో గాని నా భార్య గంగ చుట్టూ తిరుగుతుందని పైడిరాజుతో విశ్వ అంటాడు. ఎంతైనా కూతురు కదా అని పైడిరాజు అంటాడు. ఏంటి అని విశ్వ అనగానే  అతను టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అసలు రుద్ర తన మేనల్లుడు అని సుధకి చెప్పి తప్పు చేసానని విశ్వ అనుకుంటాడు. అప్పుడే ఎదురుగా రంగా, శకుంతల, పెద్దసారు వస్తున్న కార్ పైడిరాజు వస్తున్న కార్ ఎదురుగా వచ్చి ఆగుతారు.

ఏంట్రా కళ్ళు కనిపిస్తలేవా అని రంగా కార్ దిగుతాడు. పైడిరాజుని రంగా చూసి ఓ బాబాయ్ నువ్వా అని అంటాడు. అప్పుడే విశ్వ దిగి వాడితో మాటలు ఏంటి అని అంటాడు. ఇటువైపు పెద్దసారు, శకుంతల కార్ దిగుతారు. విశ్వని చూసి షాక్ అవుతారు. విశ్వ అని పెద్దసారు అంటాడు. ఏంటి విజయంద్ర ప్రతాప్ గారు ఇంకా మనుషులని చంపే ప్రయత్నం మీదనే ఉన్నారా అంటూ పెద్దసారుని ఇష్టం వచ్చినట్లు తిడుతాడు విశ్వ. అదంతా రంగా, పైడిరాజు చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.